కొట్టుకుపోయాడు: హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన యువకుడు!
- చింతల మధుసూదనరెడ్డి నగర్‌లో ఓపెన్ నాలా
- కల్వర్టుపై నుంచి వెళుతుండగా నాలాలో జారిపడ్డ యువకుడు
- రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం
- యువకుడి కోసం గణేశ్ నగర్ లో గాలింపు
హైదరాబాద్‌లో కురుస్తోన్న వర్షాలకు పలు ప్రాంతాల్లో నాలాలు పొంగుతుండడంతో ప్రమాదకర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల నాలాలు తెరుచుకునే ఉండడంతో నీరంతా బయటకు ప్రవహిస్తోంది.
నగరంలోని చింతల మధుసూదనరెడ్డి నగర్‌లో ఓపెన్ నాలా కారణంగా, ఓ యువకుడు కల్వర్టుపై నుంచి వెళుతుండగా నాలాలో జారిపడి కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఆ యువకుడిని రక్షించే ప్రయత్నాలు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. నాలాలో కొట్టుకుపోయిన యువకుడి కోసం గణేశ్ నగర్ లో గాలిస్తున్నారు.