పోలీసు: రద్దీగా ఉండే వీధిలో పోలీసుని కుర్చీకి కట్టేసి కొట్టిన స్థానికులు.. వీడియో వైరల్!

  • జమ్ముకశ్మీర్ లోని గందెర్ బాల్ లో ఘటన
  • ఓ మహిళ ఫొటోలను తీసిన పోలీస్ 
  • అక్కడే బుద్ధి చెప్పిన స్థానికులు

పోలీసుని రోడ్డుపై కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసి స్థానికులు చితక్కొట్టిన ఘటన జమ్ముకశ్మీర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఎప్పుడూ ర‌ద్దీగా ఉండే గందెర్ బాల్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బుర్కా ధ‌రించి ఆ ప్రాంతంలో నిల్చున్న ఓ మ‌హిళ‌ను చూసిన ఓ పోలీసు ఆమె ఫొటోలు తీశాడు.

ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు ఆ పోలీసుని ప‌ట్టుకుని అక్క‌డే బుద్ధి చెప్పారు. బాధిత మ‌హిళ‌తో పాటు స్థానికులు ఆ పోలీసుని దూషించారు. ఆ పోలీసుపై బాధిత మహిళ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News