రాజుగారి గది 2: ‘రాజుగారి గది 2’కు మంచి టాక్ రావడంపై సీనియర్ నరేష్ సంతోషం

  • ఓంకార్, పీవీపీ, నాగార్జున తో పాటు చిత్ర యూనిట్ కు అభినందనలు
  • ఈ చిత్రంలో నా పాత్రను ఎంజాయ్ చేశా
  • ట్వీట్ లో సీనియర్ నరేష్

ఓంకార్ దర్శకత్వం వహించిన ‘రాజుగారి గది 2’ ఈరోజు విడుదలైంది. ఈ చిత్రం బాగుందంటూ సినీ క్రిటిక్స్ నుంచి సమీక్షలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించిన సీనియర్ నరేష్ ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశారు.

‘దర్శకుడు ఓంకార్, నిర్మాత పీవీపీ, నాగార్జునతో పాటు ‘రాజుగారి గది 2’ చిత్ర యూనిట్ కు అభినందనలు. ఈ చిత్రంపై మంచి సమీక్షలతో పాటు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ చిత్రంలో నా పాత్రను బాగా ఎంజాయ్ చేశాను’ అని పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News