ట్రంప్: ఉత్త‌ర‌కొరియా అంశం.. ఏదో ఒకటి చేయాల్సిన దశకు చేరుకుంది.. నిర్ణయం తీసుకుంటా: ట్రంప్

  • ఉ.కొరియాపై భిన్నమైన వైఖరి కలిగి ఉన్నాను
  • సైనిక, రక్షణ శాఖ సలహాదార్లతో చర్చించా
  • ప్రపంచానికి, అమెరికాకు మేలు చేసే నిర్ణయాన్నే తీసుకుంటా

ఉత్త‌ర‌కొరియా అంశం ఏదో ఒకటి చేయాల్సిన దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అన్నారు. దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోన్న ఉత్త‌రకొరియా అంశంపై నిన్న త‌మ ర‌క్ష‌ణ శాఖ అధికారుల‌తో ట్రంప్ చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఇదే స‌మ‌యంలో ఉత్త‌ర కొరియాపై అమెరికా యుద్ధ విమానాలు చ‌క్క‌ర్లు కొట్టాయి. దీంతో ఉత్త‌ర‌కొరియా మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.

ఈ ప‌రిణామాల‌పై తాజాగా స్పందించిన ట్రంప్... ఇప్పటికే ఉత్త‌ర‌కొరియా అంశంపై సైనిక, రక్షణ శాఖ సలహాదార్లతో చర్చించినట్లు చెప్పారు. ఆ దేశం విషయంలో తాను భిన్నమైన వైఖరి కలిగి ఉన్నట్లు వ్యాఖ్యానించారు. తాను ప్రపంచానికి, అమెరికాకు మేలు చేసే నిర్ణయాన్నే తీసుకుంటానని, త‌మ దేశంలో గత ప్రభుత్వాలే ఉత్తర కొరియా సమస్యను పరిష్కరించి ఉండాల్సిందని ట్రంప్ అన్నారు.

  • Loading...

More Telugu News