కారు చోరీ: సచివాలయం ప్రాంగణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కారు చోరీ!
- ఢిల్లీలో షాకింగ్ ఘటన
- సచివాలయం నుంచి కేజ్రీవాల్ బ్లూ వేగాన్ మాయం
- ఆరా తీస్తోన్న పోలీసులు
ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బ్లూ వేగాన్ కారు చోరీకి గురైంది. ఒక ముఖ్యమంత్రి కారు.. అది కూడా ఢిల్లీలోని సచివాలయం ప్రాంగణంలోనే చోరీ కావడంతో కలకలం రేగింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు కారు కోసం గాలించే పనిలో పడ్డారు.
ఆ కారుని ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాలంటీర్లు ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఈ రోజు 2 గంటల ప్రాంతంలో ఆ కారును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడని సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.