geetamadhuri: డ్రగ్స్ కేసులో ఇంటరాగేషన్ కి నందూను పిలిచినప్పుడు నేను భయపడలేదు : గీతామాధురి
- నందూ ఎలాంటివాడో తెలుసు
- తను నా దగ్గర ఏ విషయాలను దాచడు
- అందుకే ధైర్యంగా వున్నాను
- నందూ పేరెంట్స్ బాధపడ్డారు
తెలుగు సినీ గాయనిగా గీతామాధురి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అలాంటి గీతామాధురి తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ తో పాటు కుటుంబ సంబంధమైన విషయాలను కూడా పంచుకున్నారు. "నందూను డ్రగ్స్ కేసులో ఇంటరాగేషన్ కి పిలిచినప్పుడు ఎలా ఫీలయ్యారు" అనే ప్రశ్నకి ఆమె తనదైన శైలిలో స్పందించింది.
నందూ ఎలాంటివాడో తనకి పూర్తిగా తెలుసనీ .. తన దగ్గర ఆయన ఏ విషయాలను దాచడని చెప్పింది. నందూపై తనకి పూర్తిగా నమ్మకం ఉండటం వలన, ఎంత మాత్రం భయం లేకుండా ధైర్యంగా వున్నానని అంది. అయితే అసలు ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ కేసు విషయంలో నందూ పేరు వినిపించడం, తన అత్తింటివారికి బాధను కలిగించిందని చెప్పింది. నిప్పులేకపోయినా పొగ వస్తుందనే విషయం ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి తనకి అర్థమైందని చెప్పుకొచ్చింది.