స్టాక్ మార్కెట్లు: నష్టాలతో ముగిసిన ఈరోజు స్టాక్ మార్కెట్లు!

  • మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్
  • చివరి గంటల్లో అమ్మకాల బాట పట్టిన ట్రేడర్లు
  • డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.65.24 

స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 90 పాయింట్లు నష్టపోయి 31,834 పాయింట్ల వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 9,985 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈలో హిందూస్థాన్ పెట్రోలియం, భారతీ ఇన్ ఫ్రాటెల్, భారతీ ఎయిర్ టెల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, టీసీఎస్ సంస్థల షేర్లు లాభపడగా, టాటా మోటార్స్, ఎస్బీఐ, వేదాంత లిమిటెడ్, యస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 65.24గా కొనసాగుతోంది.

కాగా,  జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలపై సానుకూలంగా ఉన్న మదుపర్లు మొదట్లో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో, స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో లాభాల్లో పయనించాయి. 90 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్ ఒక దశలో 32 వేల మైలురాయిని దాటింది. అయితే, చివరి గంటల్లో ఉన్నట్టుండి ట్రేడర్లు అమ్మకాల బాట పట్టడంతో స్టాక్ మార్కెట్లు లాభాల నుంచి నష్టాల్లోకి వెళ్లాయి. 

  • Loading...

More Telugu News