టీమిండియా: ఆసీస్ విజయ లక్ష్యం 119 పరుగులు!
- రెండో టీ20లో రాణించిన ఆసీస్ బౌలర్లు
- 20 ఓవర్లకి 118 పరుగులకి టీమిండియా ఆలౌట్
- చిట్ట చివరి బంతికి బుమ్రా రనౌట్
టీమిండియా, ఆసీస్ మధ్య జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా... ఆసీస్ ముందు 119 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా బ్యాట్స్ మెన్ లో రోహిత్ శర్మ 8, కెప్టెన్ కోహ్లీ (డకౌట్), శిఖర్ ధావన్ 2, మనీశ్ పాండే 6, కేదార్ జాదవ్ 27, ధోనీ 13, భువనేశ్వర్ కుమార్ 1, హార్దిక్ పాండ్యా 25, కుల్దీప్ యాదవ్ 16 పరుగులు చేశారు.
బుమ్రా 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చివరి బంతికి రనౌట్ కాగా చాహెల్ 3 (నాటౌట్) పరుగులు చేశాడు. టీమిండియాకి ఎక్స్‌ట్రాల రూపంలో 10 పరుగులు వచ్చాయి. దీంతో 20 ఓవర్లకి టీమిండియా 118 పరుగులకి ఆలౌట్ అయింది. బెహెండ్రోఫ్ నాలుగు వికెట్లు తీయగా, జంపా 2, కౌల్టర్ నైల్, ఆండ్రై టై, స్టొయినిస్ ఒక వికెట్ తీశారు.