రైతులు: నీళ్ల కోసం గొడవపడ్డ ఆంధ్ర, కర్ణాటక రైతులు!
- ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న సువర్ణముఖి నది
- ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ప్రవహించే సువర్ణముఖి నది
- అనంతపురం జిల్లా అగళి వద్ద నిర్మించిన ఆనకట్టకు చిన్న గండి
- నీరంతా కర్ణాటకకు వెళుతోందన్న తెలుగు రైతులు
ఈ సారి వర్షాలు బాగా పడడంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ప్రవహించే సువర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయితే, అనంతపురం జిల్లా అగళి వద్ద నిర్మించిన ఆనకట్టకు చిన్న గండి పడడంతో ఆ నీరంతా కర్ణాటకకు వెళుతోంది. దీంతో ఆ నీరు వెళ్లకుండా ఉండేందుకు తెలుగు రైతులు ప్రయత్నాలు జరుపుతుండగా కర్ణాటక రైతులు అడ్డుకున్నారు. నీరంతా కర్ణాటకకు పోతోందని తెలుగు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గొడవ పడిన రెండు రాష్ట్రాల రైతులను పోలీసులు అదుపు చేశారు. మళ్లీ గొడవ చెలరేగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.