‘పద్మావతి’: ‘పద్మావతి’ ట్రైలర్ పై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు
- పిచ్చి ఎక్కించేంత అందంగా ఉంది
- ప్రతి ఫ్రేమ్ ను ఎంతో నైపుణ్యంతో తెరకెక్కించారు
- ట్వీట్ చేసిన రాజమౌళి
సంజయ్ లీలా భన్సాలి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘పద్మావతి’ చిత్రం ట్రైలర్ ను నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ పై ఇప్పటికే సినీ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్పందించారు. ‘పిచ్చి ఎక్కించేంత అందంగా ఉంది!! ప్రతీ ఫ్రేమ్ ని ఎంతో నైపుణ్యంతో దర్శకుడు తెరకెక్కించారు’ అని ‘పద్మావతి’ ట్రైలర్ పై రాజమౌళి ప్రశంసలు కురిపించారు.
కాగా, టైటిల్ రోల్ ను దీపికా పదుకొనే పోషిస్తుండగా, ఆమె భర్త రావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. అల్లా వుద్దీన్ ఖిల్జీ పాత్రను రణ్ వీర్ సింగ్ పోషించాడు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.