వర్షం: మూఢ నమ్మకాలు.. వర్షాల కోసం విచిత్రంగా ప్రవర్తించిన ప్రజలు!
- తమిళనాడులోని ఆరల్ వాయ్ మొలి, తోవాలై, షెన్బగరాయన్ పుదూర్ లలో ఘటన
- ఓ మహిళ దిష్టి బొమ్మతో శవయాత్ర
- మహిళలంతా కలిసి బోరున విలపిస్తూ కొనసాగిన శవయాత్ర
తమ ప్రాంతంలో వర్షాల కోసం తమిళనాడులోని ఆరల్ వాయ్ మొలి, తోవాలై, షెన్బగరాయన్ పుదూర్ తో పాటు పలు ప్రాంతాల్లో ప్రజలు విచిత్రంగా ప్రవర్తించారు. వీరి తీరు చూస్తే భారత్లో ఇంకా మూఢ నమ్మకాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తుంది. తమ ప్రాంతంలో వర్షాలు పడాలని ఓ మహిళ దిష్టి బొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఆ బొమ్మ మృతదేహంతో ముందుకు వెళుతూ మహిళలంతా కలిసి వర్షాలు కురవాలంటూ బోరున విలపించారు.
ఇలా చేస్తే వర్షం పడుతుందని అమాయకంగా చెబుతున్నారు. ఆ బొమ్మను ఊరి పొలిమేరల్లో దహనం చేశారు. వర్షాలు పడాలంటూ భారత్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తోన్న ఘటనలు తరుచూ జరుగుతున్నాయి.