: న్యాయమంత్రితో సమావేశం తర్వాత నివేదికలో మార్పులు: సిబిఐ
బొగ్గు కుంభకోణానికి సంబంధించి సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా సుప్రీంకోర్టులో తాజా అఫిడవిట్ ను దాఖలు చేశారు. న్యాయమంత్రి, ప్రధాని కార్యాలయ అధికారులు, అటార్నీ జనరల్ సూచనల మేరకు దర్యాప్తు నివేదికలో మార్పులు చేసిన మాట వాస్తవమేనని సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. మార్చి 6న న్యాయమంత్రి అశ్వనీ కుమార్ తో సమావేశం జరిగిందని, ఇందులో ఇద్దరు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, అటార్నీ జనరల్ వాహనవతి, హరీష్ రావల్ కూడా పాల్గొన్నారని చెప్పారు. అనంతరం బొగ్గు కుంభకోణం దర్యాప్తు నివేదికలో స్వల్ప మార్పులు చేసినట్లు అంగీకరించారు. బొగ్గు కుంభకోణం కేసుపై సుప్రీం బుధవారం విచారణ జరపనుంది.