బాలకృష్ణ: బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధాలున్నాయి కానీ,... !: అంబికా కృష్ణ
- వాళ్ల మధ్య సత్సంబంధాలున్నాయో లేదో నాకు తెలియదు!
- ఆ పని మేధావులు చేయాల్సిందే!
- టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ని మళ్లీ కనెక్ట్ చేయడంపై స్పందించిన అంబికా కృష్ణ
బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధాలున్నాయి గానీ, మంచి సంబంధాలున్నాయో లేదో, తనకు తెలియదని ఏపీ ఫిల్మ్, థియేటర్, డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నాయకుడు అంబికా కృష్ణ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ని మళ్లీ కనెక్ట్ చేయడానికి మీరు పెద్దన్నయ్య పాత్ర నిర్వహిస్తారా?’ అని ప్రశ్నంచగా, ‘నేనెంత అండీ! పెద్ద పెద్ద వాళ్లు, మేధావులు చాలా మంది ఉన్నారు. ఆ పని మేధావులు చేయాల్సిందే’ అని అన్నారు.
‘బ్యాంకులను మోసం చేసిన వ్యక్తుల్లో మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి!’ అని ప్రశ్నించగా, ‘‘అంబికా దర్బార్’ సంస్థ ఎప్పుడూ దివాళా తీయలేదు. అలాంటిదేమీ లేదు’ అని చెప్పారు. చదువుకు, వ్యాపారానికి ఎటువంటి సంబంధం లేదని, తన తండ్రి చదువుకున్నది కేవలం మూడో తరగతేనని, ఇరవై ఐదు రూపాయలతో నాడు తమ సంస్థను స్థాపించారని చెప్పారు. ‘నేను పదో తరగతి చదివాను. నా లైఫ్ లో కాలేజీకి వెళ్లలేదు’ అని ఇంకో ప్రశ్నకు సమాధానంగా అంబికా కృష్ణ చెప్పుకొచ్చారు.