విజయనగరం: విజయనగరం జిల్లా వైసీపీ సమన్వయకర్త రాజీనామా!

  • వైసీపీ అధినేత జగన్ కు లేఖ రాసిన కోలగట్ల వీరభద్రస్వామి
  • కొంత మందితో కలిసి పని చేయడం నాకు ఇష్టం లేదు
  • బొత్సతో ఎటువంటి విభేదాలు లేవు

విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు, జిల్లా సమన్వయ కర్త కోలగట్ల వీరభద్ర స్వామి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్ కు ఓ లేఖ ద్వారా తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత కారణాలతో పాటు, జిల్లా నాయకుల్లో కొంతమందితో కలిసి పనిచేయడం తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అయితే, సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, ఆయన తనకు సోదర సమానులని, ఆయనతో కలిసి పని చేసేందుకు తాను సిద్ధమేనని చెప్పారు. జిల్లా సమన్వయ కర్త బాధ్యతలను మరొకరికి అప్పగించాలని జగన్ కు రాసిన లేఖలో వీరభద్రస్వామి కోరారు.

  • Loading...

More Telugu News