: విగ్రహావిష్కరణ విషయమై స్పీకర్ ను కలిసిన టీడీపీ ఎంపీలు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని పార్లమెంట్ లో ఆవిష్కరిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఆహ్వానించకపోవడం సబబు కాదని టీడీపీ ఎంపీలు స్పీకర్ మీరా కుమార్ కు నివేదించారు. ఇదే విషయమై టీడీపీ ఎంపీలు ఈ ఉదయం స్పీకర్ మీరా కుమార్ ను కలిశారు.