రోబో 2.0: రజనీకాంత్ ‘రోబో 2.0.. త్రీడీ మేకింగ్ వీడియో’ విడుదల
- రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో ‘రోబో 2.0’
- ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు
- శంకర్ ట్విట్టర్ ఖాతాలో వీడియో విడుదల
రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. వారి కాంబినేషన్‌లో వస్తోన్న ‘రోబో 2.0’ సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఈ సినిమాని ప్రేక్షకులు త్రీడీలోనూ చూడవచ్చు. ‘2.0 త్రీడీ మేకింగ్’ పేరుతో దర్శకుడు శంకర్ ఈ రోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు.
షూటింగులో రజనీకాంత్, అక్షయ్ కుమార్ ఎంత సీరియస్‌గా పాల్గొంటున్నారో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. పలువురు నటులు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. త్రీడీలో ఆడియన్స్ ఈ సినిమాను చూసి మంచి అనుభూతిని పొందుతారని వీడియోలో పేర్కొన్నారు.