: ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనూ మనీలాండరింగ్


సంచలనాల వెబ్ సైట్ కోబ్రాపోస్ట్ తాజాగా మనీలాండరింగ్ విషయంలో మరిన్ని నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఆమధ్య హెచ్ డిఎఫ్ సి బ్యాంకు, ఐసిఐసిఐ, యాక్సిక్ బ్యాంకులు మనీలాండరింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నాయంటూ కోబ్రాపోస్ట్ సంచలన కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇవే అక్రమాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలలోనూ జరుగుతున్నాయని స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలికితీసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా, దేనా, ఓరియంటల్ ఇలా 23 బ్యాంకులలో మనీలాండరింగ్ జరుగుతోందని వెల్లడించింది.

బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం(ఫెమా) నిబంధనలు, ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించాయని కోబ్రాపోస్ట్ ఎడిటర్ అనిరుద్ద బహాల్ తెలిపారు. బ్యాంకులు లెక్కా, పత్రంలేని ధనాన్ని కస్టమర్ల దగ్గర నుంచి స్వీకరించి ఇన్సూరెన్స్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాయని చెప్పారు.

  • Loading...

More Telugu News