రఘువీరారెడ్డి: మోదీ, చంద్ర‌బాబుకి ర‌ఘువీరారెడ్డి బ‌హిరంగ లేఖ‌లు

  • ఇత‌ర రాష్ట్రాల్లో చ‌దువుతున్న మ‌న‌ అగ్రిక‌ల్చ‌ర‌ల్ విద్యార్థులకు న్యాయం చేయాలి
  • బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేసిన 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు
  • ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవకాశం క‌ల్పించాలి
  • జీవో నెంబ‌రు 64 ప్ర‌కారం ఉద్యోగాలివ్వాలి

ఇత‌ర రాష్ట్రాల్లో చ‌దువుతున్న మ‌న‌ అగ్రిక‌ల్చ‌ర‌ల్ విద్యార్థులకు న్యాయం చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి బ‌హిరంగ లేఖ‌లు రాశారు. ఇత‌ర రాష్ట్రాల్లో యూజీసీ గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీల్లో అగ్రిక‌ల్చ‌ర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేసిన 30 వేల మంది విద్యార్థుల‌కు జీవో నెంబ‌రు 64 ప్ర‌కారం వ్య‌వ‌సాయ అధికారుల ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవకాశం క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని సూచించారు. ప్ర‌భుత్వాల విధానాల‌తో విద్యార్థులు ఆందోళ‌న చెందుతున్నార‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News