హైదరాబాద్: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం
- రహదారులు జలమయం
- పలు చోట్ల ట్రాఫిక్ జాములు
- ఇబ్బంది పడుతున్న వాహనదారులు
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ మొదలైన ప్రాంతాల్లో వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. దీంతో, పలు చోట్ల ట్రాఫిక్ జాములు ఏర్పడ్డాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.