అల్లు అర్జున్: అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఫొటో ‘సూపర్’ అంటున్న నెటిజన్లు!

  • ‘ఫేస్ బుక్’ ఖాతాలో స్టైలిష్ స్టార్ ఫ్యామిలీ చిత్రం  
  •  భార్య, కొడుకు, కూతురుతో గ్రూప్ ఫొటో 
  • ‘బ్యూటీఫుల్ ఫ్యామిలీ’ అంటున్న నెటిజన్లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో దిగిన ఓ ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఇందులో కూతురు అర్హ, భార్య స్నేహారెడ్డి, కొడుకు అయాన్ లతో కలిసి అల్లు అర్జున్ ఫొటోకు పోజిచ్చాడు. వీరితో పాటు మరో బాలుడు కూడా ఈ ఫొటోలో ఉన్నాడు.

అయితే, ఈ ఫొటో ఏ సందర్భంలో దిగారనే విషయాన్ని అల్లు అర్జున్ ప్రస్తావించలేదు. కాగా, అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఈ ఫొటోపై నెటిజన్లు స్పందిస్తూ, ‘క్యూట్ ఫ్యామిలీ’, ‘బ్యూటీఫుల్’, ‘సూపర్బ్ ఫ్యామిలీ’, ‘ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ మూవీ.. స్నేహా మేడమ్ లుకింగ్ సో ప్రెట్టీ’ అంటూ తమ సంతోషం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News