టీడీపీ: టీడీపీలో చేరడం లేదు.. ఆ వార్తలు అవాస్తవం!: వైసీపీ ఎంపీ బుట్టా రేణుక

  • వైసీపీలోనే కొనసాగుతా
  • జగన్ తో నాకు ఎటువంటి విభేదాలు లేవు
  • పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నా 
  • పాత్రికేయులతో ఎంపీ రేణుక

తాను టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలపై వైసీపీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. ఈ వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. వైసీపీలోనే తాను కొనసాగుతానని, టీడీపీలో చేరనని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ తో తనకు ఎటువంటి విభేదాలు లేవని, పార్టీ కార్యక్రమాల్లో తాను చురుగ్గా పాల్గొంటున్నానని పాత్రికేయులతో చెప్పారు. తాను టీడీపీలో చేరుతున్నట్టు ఓ పథకం ప్రకారం కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా రేణుక ఆరోపించారు.

  • Loading...

More Telugu News