రామ్ గోపాల్ వర్మ: హిందీ ‘శివ’ను గుర్తుచేసుకున్న రామ్ గోపాల్ వర్మ

  • ముంబైలో ‘శివ’ ప్రీమియర్ షో  పేపర్ క్లిప్పింగ్ పోస్ట్ చేసిన వర్మ
  • ఆ క్లిప్పింగ్ లో అమితాబ్, అమ్రిష్ పురి, నాగార్జున, వర్మ

నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ ఫొటోను పోస్ట్ చేశారు. హిందీ ‘శివ’ చిత్రం ద్వారా నటుడు నాగార్జున బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే సందర్భంలో ముంబైలో నాడు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ, ఇందుకు సంబంధించి ఓ ఆంగ్ల పత్రికలో ప్రింట్ అయిన ఫొటోలను పోస్ట్ చేశారు.

ముంబైలో నాడు నిర్వహించిన హిందీ ‘శివ’ ప్రీమియర్ షో కు సెలెక్టెడ్ ఆడియన్స్ ను మాత్రమే ఆహ్వానించినట్టు అందులో ఉంది. ఆ ప్రీమియర్ షోకు హాజరైన ముఖ్య అతిథుల్లో బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ఒకరు. నాటి నటుడు అమ్రిష్ పురి, నాగార్జున, రామ్ గోపాల్ వర్మ తదితరులు ఈ ఫొటోలో ఉండటం గమనార్హం. కాగా, నాగార్జున హీరోగా వర్మ దర్శకత్వంలో 1989లో తెలుగులో విడుదలైన చిత్రం ‘శివ’. హిందీ ‘శివ’ 1990లో విడుదలైంది. 

  • Loading...

More Telugu News