పవన్: రేణూ దేశాయ్ పెళ్లి చేసుకుంటానంటే పవన్ ఫ్యాన్స్ ఇలాగేనా మాట్లాడేది?: ధ్వజమెత్తిన మహేశ్ కత్తి
- రేణూ దేశాయ్ కి మద్దతుగా మహేశ్ కత్తి పోస్ట్
- పీకే ఫ్యాన్స్ పిచ్చి పీక్స్ లో ఉంది
- రేణూ దేశాయ్ పర్సనల్ లైఫ్‌లోకి ఎందుకు వెళుతున్నారు?
- ఆ తిట్టడం ఏమిటి? ఇంత మూర్ఖత్వం ఏమిటి?
‘మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీపై గౌరవం తగ్గిపోతుంది.. పవన్ కల్యాణ్ ని అన్న అని పిలుస్తాం, నిన్ను వదిన అంటాం.. మీ నిర్ణయంతో అందరూ బాధపడే అవకాశం ఉంది’ అంటూ ఫేస్బుక్లో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌పై అభిమానులు మండిపడ్డ విషయం తెలిసిందే. రేణూ దేశాయ్ వ్యక్తిగత విషయంలోకి వెళ్లి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఇటువంటి వార్తలు రాయడం పట్ల సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి మండిపడ్డాడు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తనను టార్చర్ పెడుతున్నారని గతంలో మహేశ్ కత్తి మీడియా ముందుకు వచ్చి ఆవేదన చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఫ్యాన్స్ రేణూ దేశాయ్ పై ఇటువంటి కామెంట్లు చేయడం చూస్తోంటే పీకే ఫ్యాన్స్ పిచ్చి పీక్స్ లో ఉన్నట్లు తనకు అనిపిస్తోందని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
ఓ అభిమాని తన పోస్ట్ పై అభ్యంతరం తెలపగా, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రేణూ దేశాయ్ పర్సనల్ లైఫ్‌లోకి ఎందుకు వెళుతున్నారని మహేశ్ కత్తి నిలదీశాడు. ‘ఏడు సంవత్సరాల ఒంటరి జీవితం తర్వాత రేణూ దేశాయ్ పెళ్లి చేసుకుంటానంటే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి ఏమిటి అభ్యంతరం? ఆ తిట్టడం ఏమిటి! ఆ ట్రాల్స్ ఏమిటి? ఇంత మూర్ఖత్వం ఏమిటి? ఇంత పర్వార్టెడ్ భావజాలం ఏమిటి? ఇవేవీ కనిపించనంతగా మీ కళ్ళు మూసుకుపోవడం ఏమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని పేర్కొన్నాడు.