పెద్ద ఎన్టీఆర్: ఎన్టీఆర్ పై సినిమా తీసే స్వేచ్ఛ అంద‌రికీ ఉంది: జూ.ఎన్టీఆర్

  • సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటించను
  • ఆ రోజుల్లో తాతయ్య కుటుంబాన్ని విడిచి రాజకీయాల్లోకి వెళ్లారు
  • ఎన్టీఆర్ పై సినిమా తీస్తే మరొకరు దాన్ని ఆపగలరని అనుకోవడం లేదు

సీనియర్ ఎన్టీఆర్ పై సినిమా తీసే స్వేచ్ఛ అంద‌రికీ ఉంద‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ అన్నాడు. ఆయ‌న‌ జీవిత కథతో ఎవరైనా సినిమా తీస్తే అందులో నటిస్తారా? అన్న ప్ర‌శ్నకు మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్ నో అని చెప్పేశాడు. తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... ఎన్టీఆర్ ఆ రోజుల్లో కుటుంబాన్ని విడిచి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్లార‌ని అన్నాడు. ఎన్టీఆర్‌ రాష్ట్ర ప్రజల ఆస్తిగా మారారని వ్యాఖ్యానించాడు. ఆయ‌న‌ జీవిత చ‌రిత్ర‌పై సినిమా తీస్తామని ఎవరు ముందుకొచ్చినా, వారిని మరొకరు ఆపగలరని తాను అనుకోవడం లేదని చెప్పాడు.

అయితే, ఎన్టీఆర్ పాత్రలో తాను మాత్రం న‌టించ‌బోన‌ని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. అంత ధైర్యం త‌న‌కు లేద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన‌ ‘జై లవకుశ’ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  

  • Loading...

More Telugu News