కొరడా: మూఢ నమ్మకాలు.. పూజారి చేత కొరడాతో కొట్టించుకున్న అమ్మాయిలు!

  • తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో మూఢ నమ్మకాలు
  • కొరడా దెబ్బలు తిన్న రెండు వేల మంది యువతులు
  • దాదాపు గంటసేపు కొరడా ఝళిపించిన పూజారి

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో పెళ్లికాని ఆడపిల్లలు, పెళ్లయినా సంతానం లేని యువతులు పూజారీ చేత కొరడాతో కొట్టించుకుంటున్నారు. కంప్యూటర్ యుగంలోనూ ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళితే, ముసిరి సమీపం వెళ్లాలపట్టి గ్రామంలో అచ్చప్పన్ ఆలయానికి నిన్న దాదాపు రెండు వేల మంది యువతులు వ‌చ్చారు.  

ఆలయ పూజారి పూజలు చేసిన అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చాడు. తర్వాత ఆయన నృత్యం చేస్తూ త‌న చేతిలోని కొర‌డాతో ఒక్కో మహిళ వీపు విమానం మోత మోగించాడు. కొంద‌రు ఆ దెబ్బల ధాటికి స్పృహ‌ కూడా కోల్పోయారు. దాదాపు గంటసేపు ఆ పూజారి కొరడాతో కొట్టాడు. తాము ప్ర‌తి ఏడాది ద‌స‌రా మ‌రునాడు ఇలాగే చేస్తామ‌ని, ఇలా చేస్తే మంచి జ‌రుగుతుంద‌ని ఆ గ్రామ‌స్తులు అమాయ‌కంగా చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News