కోదండరామ్: కోదండరామ్ ‘కాంగ్రెస్’ నాయకుడే: కర్నె ప్రభాకర్ విమర్శ

  • మీడియాతో మాట్లాడిన కర్నె ప్రభాకర్
  • సత్యాగ్రహం విరమించకబోతే ప్రజలే బుద్ధి చెబుతారు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఇష్టపడని, వద్దని చెప్పిన పార్టీలతో జేఏసీ చైర్మన్ కోదండరామ్ సన్నిహితంగా ఉంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జేఏసీ నాయకుడినని చెప్పుకుంటున్న కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ అజెండాను భుజాన వేసుకున్నారని, ఆయన ‘కాంగ్రెస్’ నాయకుడేనని విమర్శించారు.

ఈ సందర్భంగా కోదండరామ్ ఎందుకు సత్యాగ్రహం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నందుకా, ఆయన సత్యాగ్రహ దీక్ష చేస్తోంది? అని మండిపడ్డ ప్రభాకర్, ఆ దీక్ష విరమించని పక్షంలో ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

  • Loading...

More Telugu News