శర్వానంద్: ‘జై లవ కుశ’, ‘స్పైడర్’ చిత్రాలు విడుదలవుతున్నాయని భయపడలేదు: నటుడు శర్వానంద్

  • ‘మహానుభావుడు’ కుటుంబ కథా చిత్రం
  • ఈ చిత్రాన్ని థియేటర్లో ప్రేక్షకులతో కలసి చూశాను  
  • కామెడీ చేయడం అంత తేలిక కాదు 

‘జై లవ కుశ’, ‘స్పైడర్’ చిత్రాలు విడుదలవుతున్నాయని భయపడలేదని, ఆ రెండు చిత్రాలు వేర్వేరు జానర్లకు చెందినవి, ‘మహానుభావుడు’ కుటుంబ కథా చిత్రమని నటుడు శర్వానంద్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మహానుభావుడు’ సినిమాను థియేటర్లో చూశానని, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు.

దర్శకుడు మారుతి వినోదాత్మక చిత్రాలను బాగా తీస్తారని, కామెడీ చేయడం అంత సులభం కాదని, సినిమా సెట్ లోనే ఆయన డైలాగ్స్ రాసేవారని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రతి సీన్ ను ఎంజాయ్ చేశానని, దర్శకుడు చెప్పినట్టు నటించేవాడినని చెప్పుకొచ్చాడు. కాగా, మూడు రోజుల క్రితం విడుదలైన ‘మహానుభావుడు’లో శర్వానంద్ సరసన మెహరీన్ నటించింది.

  • Loading...

More Telugu News