నారా లోకేశ్: షటిల్ బ్యాట్ పట్టిన నారా లోకేశ్!

  • గుంటూరులో ఆల్ ఇండియా సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన మంత్రి
  •  రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు స్టేడియాలు అవసరం

ఏపీ మంత్రి నారా లోకేశ్ షటిల్ బ్యాట్ పట్టారు. గుంటూరు నగరంలో ఓ క్లబ్ లో ఆల్ ఇండియా సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ కొంచెం సేపు షటిల్ ఆడారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, బ్రిటన్ కు చెందిన వాళ్లు అమరావతిలో ఓ పెద్ద స్టేడియం నిర్మించనున్నారని, అది మల్టీపర్పస్ స్టేడియం అని అన్నారు.

రాష్ట్ర స్థాయిలో, జిల్లాల్లోను, ప్రతి గ్రామం, మండల స్థాయిలోను స్టేడియాల ఏర్పాటు అవసరమని అన్నారు. స్టేడియంలు ఏర్పాటు చేయడం ద్వారా క్రీడాకారుల ప్రతిభను బయటకు తీయవచ్చని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మొదటి నుంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా లోకేశ్ ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News