టీమిండియా: బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా!
- బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు
- పరుగులను నియంత్రిస్తున్న ఆసీస్ బౌలర్లు
ఐదో వన్డేలో 243 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, రహానె బరిలోకి దిగారు. ఆసీస్ బౌలర్లు కమిన్స్, కూల్టర్-నీల్ ఇప్పటికే చెరో ఓవర్ వేశారు. 4 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్: 12/0. కాగా, ఐదు వన్డేల సిరీస్ లో 3-1 ఆధిక్యతలో ఉన్న టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం. వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించాల్సి ఉంది కనుక, ఆ దిశగా భారత్ జట్టు యత్నిస్తోంది.