‘బాహుబలి’: నిన్న రాత్రి ‘బాహుబలి’ నటీనటులతో కలసి పార్టీ చేసుకున్నాం: నటి రవీనా టాండన్
- ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క తో ఫొటో దిగిన రవీనా
- ‘ఇన్ స్టా గ్రామ్’ ఖాతాలో పోస్ట్ చేసిన నటి
నిన్న రాత్రి ‘బాహుబలి’ నటీనటులతో కలిసి పార్టీ చేసుకున్నామని బాలీవుడ్ నటి రవీనాటాండన్ చెప్పింది. హీరో ప్రభాస్, నటుడు రానా, నటీమణులు అనుష్క, తమన్నా మొదలైన వ్యక్తులతో కలిసి ఈ పార్టీ చేసుకున్నట్టు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో రవీనా టాండన్ పేర్కొంది. ‘నిన్న రాత్రి పార్టీ గురించి.. హైదరాబాద్ స్టైల్ లో పార్టీ చేసుకున్నాం. ఫన్, ఫుడ్, ఫ్రెండ్స్.. ’అని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రభాస్, రానా, అనుష్కతో కలిసి ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసింది.