: జుట్టుకు రంగేస్తున్నారా..? మీకో శుభవార్త


కేశాల్లో తెల్లటి పాయలు కనపడగానే.. అరెరే వార్ధక్యం ముంచుకు వచ్చేస్తోందని ఆందోళన చెందుతూ... దాన్ని దాచుకోవడానికి రంగు వేసుకునే నిరపాయకర మార్గాలను వెతుక్కుంటూ సతమతం అవుతున్నారా.. నెరిసిన జుట్టును తిరిగి యథాపూర్వ స్థానానికి తీసుకువచ్చేలా.. ఓ శాశ్వత పరిష్కారాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వెంట్రుక తెల్లబడడానికి కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. దాని మూలాల్లోకి వెళ్లి విరుగుడు ప్రయోగించే అవకాశాలను అన్వేషించారు.

తెల్లజుట్టు అనేది వెంట్రుక కుదురులో హైడ్రోజన్‌ పెరాక్సయిడ్‌ పేరుకుపోవడం వల్ల భారీ ఆక్సిడేటివ్‌ ఒత్తిడితో తయారవుతుంది. దీనివలన వెంట్రుక లోపలినుంచి తనను తాను బ్లీచ్‌ చేసుకోవడంతో రంగు వెలిసిపోయి తెల్లగా బయటకు వస్తుంది. ఇలా హైడ్రోజన్‌ పెరాక్సయిడ్‌ భారీగా పేరుకోకుండా.. సూడోకెటలేజ్‌గా పీసీ కేయూఎస్‌ ను ప్రయోగించవచ్చునని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల జుట్టు పూర్వ రంగు సంతరించుకుంటుంది. ఇదే తరహా చికిత్సతో విటిలిగో అనే చర్మ సమస్య కూడా తీరుతుంది. ఈ రుగ్మత ఉన్న 2411 మంది రోగులపై విశ్లేషణ జరిపి దీన్ని నిర్ధారించారు.

  • Loading...

More Telugu News