సుబ్రహ్మణ్య స్వామి: రాహుల్ గాంధీ హిందువేనా?: సుబ్రహ్మణ్య స్వామి

  • గుజరాత్‌ పర్యటనలో తరుచూ ఆలయాలకు వెళుతోన్న రాహుల్ గాంధీ  
  • 'హిందూ వ్యతిరేకి' ముద్రను చెరిపేసుకోవడానికేనని విమర్శలు
  • రాహుల్ గాంధీ క్రిస్టియన్ అని త‌న‌కు అనుమానంగా ఉందన్న స్వామి
  • టెన్ జన్‌పథ్‌లో చర్చి కూడా ఉందని వ్యాఖ్య

ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ గుజరాత్‌లో ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీ 'హిందూ వ్యతిరేకి' అంటూ వస్తోన్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలోనే ఆయ‌న ఇలా ఆలయాలకు వెళుతున్నార‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

రాహుల్ గాంధీ తీరుపై స్పందించిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి... జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ హిందువేన‌ని ముందుగా నిరూపించుకోవాలని అన్నారు. ఆయన క్రిస్టియన్ అని త‌న‌కు అనుమానంగా ఉందని చెప్పారు. అంతేగాక‌, టెన్ జన్‌పథ్‌లో చర్చి కూడా ఉందని అన్నారు. 

  • Loading...

More Telugu News