: నాడీ సంబంధ బాధలకు ఒక్క కణంతో నివారణ


ఒకే ఒక్క రకం కణం .. పలురకాల నాడీ సంబంధ సమస్యలను బాగుచేసే తీరును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన వెన్నుపూస గాయాలు, దీర్ఘకాలపు నొప్పులు వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేయడంలో మార్గం సుగమం చేస్తుందని అంటున్నారు. మీడియల్‌ గ్యాంగ్లియోనిక్‌ ఎమినెన్స్‌ (ఎంజీఈ) అనే ఈ మానవ నాడీకణాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. దీన్ని ఎలుకల్లో ప్రవేశపెట్టి పరీక్షించినప్పుడు అది నిరంతరాయంగా అభివృద్ధి చెందుతున్నట్లు గుర్తించారు.

అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు నిర్వహించిన ఈ పరీక్షల్లో తేలిన ఫలితం.. నాడీ సంబంధ వ్యాధులకు చక్కటి పరిష్కారం కాగలదని శాస్త్రవేత్తల్లో ఒకరు ఆర్నాల్డ్‌ క్రిగ్‌స్టెయిన్‌ అంటున్నారు. అయితే మానవ ప్లూరిపొటెంట్‌ మూలకణాలను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ కణాన్ని ప్రయోగశాలలో తయారుచేశార్ట. కొన్ని రుగ్మతల వల్ల నాడీ సర్క్యూట్‌లు మితిమీరి క్రియీశీలంగా మారితే ఇది కట్టడిచేస్తుందని అంటున్నారు. పార్కిన్‌సన్స్‌, మూర్ఛ, అల్జీమర్స్‌ వంటి వ్యాధులకు కూడా ఇది చికిత్స కాగలదని ఆశిస్తున్నారు.

  • Loading...

More Telugu News