సోనియా గాంధీ: విశ్రాంతి కోసం గోవా వెళ్లిన సోనియా గాంధీ!

  • ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్ లో బస చేసిన సోనియా
  • విశ్రాంతి నిమిత్తం ఆమె తరచుగా గోవా వస్తారన్న కాంగ్రెస్ నేత 
  • రేపు మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి పయనం  

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఈ రోజు గోవాకు వెళ్లారు. దక్షిణ గోవాలోని మోబోర్ బీచ్ కు సమీపంలో ఉన్న ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్ లో ఆమె దిగినట్టు సమాచారం. తిరిగి రేపు మధ్యాహ్నం ఆమె ఢిల్లీకి బయలుదేరి వెళతారని తెలుస్తోంది. విశ్రాంతి నిమిత్తం సోనియా ఇక్కడికి వచ్చినట్టు ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సందర్భంగా గోవా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిమా కౌటినో మాట్లాడుతూ, విశ్రాంతి నిమిత్తం సోనియా తరచుగా ఇక్కడికి వస్తుంటారని, ఆమె ఇక్కడికి రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 

  • Loading...

More Telugu News