‘జై లవ కుశ’: ‘జై లవ కుశ’ చూశాను.. రాత్రి నిద్రపట్టలేదు!: నిర్మాత బండ్ల గణేశ్
- ట్వీట్ చేసిన నటుడు, నిర్మాత బండ్ల గణేశ్
- ‘జై లవ కుశ’ సినిమాపై ప్రశంసలు
- ఎన్టీఆర్, ఎస్వీఆర్ తర్వాత ఆ స్థాయిలో రాణించిన నటుడు తారకే!
జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవ కుశ’ చిత్రంపై నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం బాగుందని, జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో కితాబిచ్చారు. ‘జై లవ కుశ’ సినిమా రాత్రి చూశానని, నిద్ర పట్టలేదని, ఎన్టీఆర్, ఎస్వీఆర్ తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తారక్ యేనని ప్రశంసించారు. ఎన్టీఆర్, మరికొందరు నటుల తర్వాత ఆ స్థాయిలో అద్భుతంగా నటించిన మా బాద్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలని తన పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా, సక్సెస్ టాక్ సంపాదించుకున్న ‘జై లవ కుశ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రూ.100 కోట్ల కలెక్షన్స్ ను ఈ సినిమా దాటేసిందని ఈ చిత్ర నిర్మాత, నటుడు కళ్యాణ్ రామ్ పేర్కొనడం విదితమే.