చంద్రబాబు: టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతఙ్ఞతలు చెప్పిన కళావెంకట్రావు

  • రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు 
  • ఉప ఎన్నికల్లో అభివృద్ధిని చూసే ఓటు వేశారని కామెంట్
  • కాపులు టీడీపీ వైపే ఉన్నారని తేలిపోయింది

ఏపీ టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తనను రెండో సారి ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబునాయుడుకి మంత్రి కళావెంకట్రావు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కళావెంకట్రావు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అభివృద్ధిని చూసే ప్రజలు ఓటు వేశారని, అన్ని వర్గాల ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని అన్నారు. కాకినాడ ఎన్నికలతో కాపులు టీడీపీ వెంటే ఉన్నారని తేలిపోయిందని, అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు.

  • Loading...

More Telugu News