విజయవాడ: విజయవాడ కనకదుర్గ గుడి పరిసరాల్లో ఒక రోజు ట్రాఫిక్ ఆంక్షలు


రేపు మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గ గుడికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనా నేపథ్యంలో గుడి పరిసరాల్లో ఒక రోజు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ రోజు రాత్రి 11 గంటల నుంచి రేపు అర్థరాత్రి 12 గంటల వరకు వాహనాలను మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వచ్చే వాహనాలను, కంట్రోల్ రూం వద్ద ఉన్న పై-వంతెన పైకి వాహనాలను అనుమతించమని చెప్పారు.

అయితే, పాస్ ఉన్న వాహనదారులకు మాత్రమే కంట్రోల్ రూం వద్ద ఉన్న పై-వంతెనపైకి అనుమతి లభిస్తుందని చెప్పారు. ఆర్టీసీ ఇన్ గేట్ నుంచి సీతమ్మవారి పాదాల వైపు వెళ్లే వాహనాలకు, గొల్లపూడి-కుమ్మరిపాలెం నుంచి వచ్చే వాహనాలకు ఘాట్ రోడ్డు వైపు అనుమతి లేదని, గద్ద బొమ్మ నుంచి వినాయకుడి గుడివైపు వాహనాల రాకపోకలను నిలిపివేస్తామని అన్నారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాల్సిందిగా పోలీసులు కోరారు.

  • Loading...

More Telugu News