సరోగసీ: రెండేళ్ల తర్వాత తండ్రి అవ్వాలనుకుంటున్న సల్మాన్!

* సరోగసీ పద్ధతిని ఆశ్రయించనున్న సల్మాన్?

* ప్రస్తుతం బిజీగా ఉండటంతో మరో రెండేళ్లు ఆగుతాడట

* బాలీవుడ్ వర్గాల సమాచారం


బాలీవుడ్ అగ్రహీరో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ త్వరలో తండ్రి కాబోతున్నట్టు సమాచారం. ఇంతవరకూ పెళ్లి చేసుకోని సల్మాన్ ఓ బిడ్డకు తండ్రి ఎలా కాబోతున్నాడనే అనుమానం తలెత్తకమానదు. అద్దెగర్భం (సరోగసి) పద్ధతిలో తండ్రి అయ్యే ఆలోచనలో సల్మాన్ ఖాన్ ఉన్నట్టు బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడే కాదు మరో రెండేళ్ల తర్వాత ఈ పద్ధతిలో తాను తండ్రి కావాలని సల్మాన్ చూస్తున్నాడట. ప్రస్తుతం సల్మాన్ చేతి నిండా సినిమాలు ఉండటంతో రెండేళ్ల పాటు ఆగాడని సమాచారం.

 ఇదిలా ఉండగా, బాలీవుడ్ కు సంబంధించి ఇప్పటివరకు సరోగసి పద్ధతిని ఆశ్రయించిన వారిలో బాలీవుడ్ అగ్రనటులు షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, దర్శక,నిర్మాత కరణ్ జోహార్, దర్శకురాలు ఫరాఖాన్, నాటి నటుడు జితేంద్ర కుమారుడు తుషార్ కపూర్ ఉన్నారు. సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు పిల్లలకు కరణ్ జోహార్ తండ్రిగా మారాడు.

  • Loading...

More Telugu News