: సంకేతం ఇస్తే చాలు.. పనిలో అల్లుకుపోయే రోబో


కనీసం పని చెప్పాల్సిన అవసరం కూడా లేదు.. మనం ఇంట్లోంచి ఆఫీసుకు బయల్దేరితే చాలు.. ఆ రోబో వెళ్లి తలుపు తెరచి సిద్ధంగా నిల్చుంటుంది. మీకు 'అవసరమైనప్పుడు' కాఫీ తెచ్చిస్తుంది కూడా! ఇలాంటి తెలివైన రోబోను తీర్చిదిద్దింది మన భారతీయ సంతతికి చెందిన వాళ్లే. ఇలాంటి మన కదలికల్ని బట్టి పనులు చేసే ఒక రోబోను హేమ ఎన్‌ కొప్పుల, అశుతోష్‌ సక్సేనా రూపొందించారు. దీన్ని వీరు జూన్‌లో ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ మెషిన్‌ లెర్నింగ్‌లో ప్రదర్శిస్తారట.

మానవుల కదలికలను బట్టి పనులు చేసే ఈ రోబోను కార్నెల్‌ యూనివర్సిటీలోని పర్సనల్‌ రోబోటిక్స్‌ ల్యాబ్‌లో రూపొందించారు. సాధారణంగా ఆదేశాలు ఇస్తే పనిచేసే రోబోలు ఉన్నాయి. అయితే మన కదలికలను బట్టి పనిచేసేలా దీని రూపకల్పన జరిగింది. ఈ రోబోను పరీక్షించినప్పుడు.. 82 శాతం కచ్చితత్వంతో చేసినట్లు వారు తెలిపారు.

  • Loading...

More Telugu News