బిగ్ బాస్: అంతకు మించిన సక్సెస్ ఏముంటుంది!: హాస్య నటుడు ధన్ రాజ్

  • హైదరాబాద్ చేరుకున్న‘బిగ్ బాస్’ సభ్యులు
  • ప్రేక్షకుల హృదయాలను గెలిచాం
  • ఈ షో వ్యాఖ్యాతగా తారక్ అన్న ఉండటం వల్లే మా భయం పోయిందన్న ధన్ రాజ్

‘బిగ్ బాస్’ సీజన్ -1లో పాల్గొన్న పద్నాలుగు మంది సభ్యుల్లో ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ కాదని హాస్యనటుడు ధన్ రాజ్ అన్నాడు. పుణెలో నిన్న జరిగిన ‘బిగ్ బాస్’ ఫైనల్స్ కార్యక్రమంలో ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన సభ్యులు కూడా పాల్గొన్నారు. వారిలో ధన్ రాజ్ కూడా ఉన్నాడు. పుణె నుంచి హైదరాబాద్ వచ్చిన ధన్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ, ‘బిగ్ బాస్’ విజేత శివబాలాజీనే అయినప్పటికీ, ఈ షోలో పాల్గొన్న అందరూ ప్రజల హృదయాలను గెలిచేశారని, అంతకు మించిన సక్సెస్ ఇంకా ఏముంటుందంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

‘ఈ షో వ్యాఖ్యాతగా తారక్ అన్న లేకపోతే, ఇంకా ముందుగానే ఈ షో నుంచి బయటకు వచ్చేసేవాడినేమో! ఎందుకంటే, ఆయన ఉండటం వల్ల మా భయాన్ని పోగొట్టారు.. ఎంటర్ టెయిన్ చేశారు. ‘బిగ్ బాస్’కు ఏ విధంగా అయితే కృతఙ్ఞతలు చెబుతున్నామో, తారక్ అన్నకు కూడా అదే విధంగా కృతఙ్ఞతలు చెబుతున్నాము’ అని ధన్ రాజ్ అన్నాడు.

  • Loading...

More Telugu News