ఐఆర్సీటీసీ: అన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులు చెల్లుబాటవుతాయి: ఐఆర్సీటీసీ


డెబిట్ కార్డుల ద్వారా ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) చెల్లింపులు కుదరవని, అటువంటి లావాదేవీలను నిలిపివేశారంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ఐఆర్సీటీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ వార్తలను నమ్మవద్దని, ఆ వార్తలు అసత్యమని ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలని ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.

చెల్లింపుల నిమిత్తం అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించుకోవచ్చని, అన్నింటిని అనుమతిస్తామని, ఏ బ్యాంక్ కు చెందిన డెబిట్ కార్డులపైనా నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలని ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ అధికారులు కోరారు.

  • Loading...

More Telugu News