మూడో వన్డే: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

  • రోహిత్ శర్మ(71) ఔట్
  • సుదీర్ఘ భాగస్వామ్యం కొనసాగించిన శర్మ, రహానే

ఆసీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కూల్టర్ - నీల్ వేసిన బంతిని షాట్ కొట్టిన ఓపెనర్ రోహిత్ శర్మ (71), కార్ట్ రైట్ కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. శతకం సాధిస్తాడనుకున్న రోహిత్ శర్మ ఔటవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. ఓపెనర్లు రహానే, శర్మ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లడం గమనార్హం. రహానెేకు భాగస్వామిగా కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగాడు. 22.4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్ :144/1



 

  • Loading...

More Telugu News