: గ్రేట్ ఏప్ ఫ్యామిలీలో మనకు మరో పూర్వీకుడు దొరికాడు
మానవులతో పాటూ గొరిల్లా, చింపాంజీ, ఒరాంగుటాన్, బొనబొ వంటి తోకలేని వానర జాతులను అన్నిటినీ కలిపి గ్రేట్ ఏప్ ఫ్యామిలీ అని వ్యవహరిస్తారు శాస్త్రవేత్తలు. ఈ గ్రేట్ ఫ్యామిలీకి చెందిన మరో రకం సభ్యుడి అవశేషాలను తాజాగా విశ్లేషించారు. 1.10 కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఏప్ వంటి ఒక జీవి గురించిన అవశేషాలు లభ్యం కాగా శాస్త్రవేత్తలు వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. పీరోలాపితికన్ కెటాలానికన్ అనే ఈ వానరం అవశేషాలు 2002లో ఈశాన్య స్పెయిన్‌లో దొరికాయి. అప్పటినుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
దీని తుంటి ఎముకల నిర్మాణం, వెన్నుపూస, పక్కటెముకల నిర్మాణం తీరును బట్టి.. కోటి సంవత్సరాల కిందట ఈ జీవి అచ్చం ఇప్పటి మనిషి లాగానే.. రొమ్ము విరుచుకుని నిలువుగా ఉంటూ నడిచేదని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పీరోలాపితికన్ పరిణామక్రమంలో ఇవాళ మనం గ్రేట్ ఏప్ ఫ్యామిలీగా పరిగణిస్తున్న జీవ కుటుంబం నుంచి విడిపోయి.. ఆ తరువాత.. అంతరించిపోయి ఉంటుందనేది శాస్త్రవేత్తల్లో ఒకరైన ఆష్లే హేమండ్ అంచనా వేస్తున్నారు.