మోడల్ నటాలియా గురోవా: అరుదైన పువ్వుతో ఫోటోలు దిగినందుకు మోడల్ కి భారీ జరిమానా!
- ఇబ్బందుల్లో పడ్డ రష్యాకు చెందిన మోడల్ నటాలియా గురోవా
- రష్యాలోనే అరుదైన పువ్వు నీలుంబో
- సోషల్ మీడియాలో ఆ ఫొటోలు పోస్ట్ చేసిన మోడల్
రష్యాకు చెందిన మోడల్ నటాలియా గురోవా అరుదైన పువ్వుతో ఫొటోలు దిగి ఇబ్బందులు ఎదుర్కుంటోంది. రష్యాలోనే అరుదైన పువ్వు అయిన గులాబీ రంగు తామరపువ్వు (నీలుంబో) ని చేతిలో పట్టుకుని ఆమె ఫొటోలు దిగి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు పర్యావరణవేత్తల కంట పడ్డాయి. దీంతో రష్యా సర్కారు దీనిపై దర్యాప్తు జరిపి, పువ్వును కోసి ఫొటోలు దిగడంతో అది పాడైందని తెలుసుకుంది. దీంతో ఆమెకు భారీగా జరిమానా విధించిందని తెలిసింది. ఆమె తీరుపై రష్యన్ పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.