అమెరికా: మూఢ నమ్మకాల ప్రభావం.. తన ఇద్దరు కుమారులని దారుణంగా చంపేసిన తల్లి!

  • అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఘటన
  • పిల్ల‌ల‌ను బాత్ టబ్‌లో ముంచి చంపేసిన మహిళ
  • అలా చేస్తే నేరుగా స్వర్గానికి వెళ‌తార‌ని నమ్మిన వైనం

మూఢ నమ్మకాల వలలో చిక్కుకున్న ఓ మ‌హిళ త‌న పిల్ల‌ల‌ను బాత్ టబ్‌లో ముంచి చంపేసిన ఘ‌ట‌న అమెరికాలోని పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. లారెల్ మిచెల్లీ షెల్మర్ (44) అనే మ‌హిళ ఇటీవ‌ల త‌న ఇద్దరు కుమారులు డేనియల్ (6), ల్యూక్ (3) లను కొడుతూ బాత్ టబ్ వ‌ద్ద‌కు తీసుకెళ్లింది. ఆ త‌రువాత వారిని అందులో ముంచి వారి ప్రాణాలు తీసింది.

ఆ మ‌హిళ‌‌ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజ‌రుప‌ర్చగా విచార‌ణ‌లో ఆమె త‌న కొడుకుల‌ను చంపిన‌ట్లు ఒప్పుకుంది. అలా చేస్తే త‌న కుమారులు నేరుగా స్వర్గానికి వెళ‌తార‌ని, అందుకే అలా చేశాన‌ని చెప్పింది. ఆమె గ‌తంలోనూ తన పిల్లలను హ‌త్య చేయాల‌ని చూసింద‌ని పేర్కొంటూ, కోర్టు ఆమెకు 80 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

  • Loading...

More Telugu News