క్రికెట్: అస్ట్రేలియా విజయ లక్ష్యం 253 పరుగులు!
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డే మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. అస్ట్రేలియా ముందు 253 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. విరాట్ కోహ్లీ 92, అజింక్యా రహానే 55 పరుగులు (రనౌట్) చేసి రాణించారు. మిగతా టీమిండియా బ్యాట్స్ మెన్ లో రోహిత్ శర్మ 7 మనీష్ పాండే 3, కేదర్ జాదవ్ 24, హార్థిక్ పాండ్యా 20, భువనేశ్వర్ కుమార్ 20, కుల్దీప్ యాదవ్ 0, బుమ్రా 10, చాహల్ 1 పరుగు చేశారు.
టీమిండియాకు ఎక్స్ట్రాల రూపంలో 15 పరుగులు వచ్చాయి. దీంతో 50 ఓవర్లలో 252 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ కౌల్టర్ నైల్, రిచర్డ్సన్ మూడేసి వికెట్లు తీయగా, అగర్, కమ్మిన్స్ ఒక్కో వికెట్ వికెట్ తీశారు.