chandrababu: అటవీశాఖ పనితీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
విధుల్లో అలసత్వం కనబరుస్తోన్న అటవీశాఖ అధికారులపై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ పనితీరు బాగోలేదని అన్నారు. సరిగా పనిచేయని అధికారులను సస్పెండ్ చేసేందుకు వెనకాడనని చెప్పారు. సిబ్బంది సరిగా పనిచేయడం లేదని, పచ్చదనం పెంపు విషయంలో అధికారులు శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ‘వనం-మనం’ కార్యక్రమం అమలులో అలసత్వం చూపించకూడదని సూచించారు. చురుకుగా పనిచేస్తూ మంచి ఫలితాలు రాబట్టాలని చెప్పారు.