గ్రేట్ ఇండియన్ సేల్: అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ సేల్’.. పలు ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలు
- ఆహారోత్పత్తులపై 40 శాతం డిస్కౌంట్లు
- బ్యూటీ ఉత్పత్తులపై 35 శాతం
- బేబీ కేర్ ఉత్పత్తులపై 70 శాతం
ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ సేల్’ ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు లభించే ఆఫర్లలో ఫుడ్, గ్రోసరీ ఐటెమ్స్‌పై భారీ తగ్గింపు ధరలను పొందవచ్చు. ఆహారోత్పత్తులపై ఏకంగా 40 శాతం డిస్కౌంట్లు అందిస్తోంది. వీటిని విక్రయించేందుకు ఇటీవలే ఆ సంస్థకు సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరోవైపు వీటిపై మార్కెట్లో ఇతర కంపెనీల నుంచి పోటీ అధికంగా ఉంది.
దీంతో అమెజాన్ వీటిపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. అమెజాన్‌లో ఈ నాలుగు రోజుల పాటు పర్సనల్ కేర్, బేబీ ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. బ్యూటీ ఉత్పత్తులపై 35 శాతం వరకు, బేబీ కేర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు తగ్గింపు ధరలు ఇస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది. కాగా, గ్రేట్ ఇండియన్ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ లపై కూడా అమెజాన్ డిస్కౌంట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం అమెజాన్ వెబ్ సైట్ చూడొచ్చు.