వీరేంద్ర సెహ్వాగ్: ఆ కాలంలో ఇంటిబ‌య‌ట ఉండే సీసీ కెమెరాలను చూడండి: పాత ఫొటోతో వీరేంద్ర సెహ్వాగ్ చమక్కులు


ట్విట్ట‌ర్‌లో త‌న‌దైన శైలిలో పోస్టులు చేస్తూ ట్విట్ట‌ర్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న టీమిండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్.. త‌న అభిమానుల‌ను ప్ర‌తిరోజూ త‌న పోస్ట్‌ల‌తో అల‌రిస్తున్నాడు. ఆయ‌న‌కు ట్విట్ట‌ర్‌లో 12 మిలియ‌న్ల‌కు పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారు. అప్ప‌ట్లో క్రికెట్‌లో భారీ షాట్లు కొట్టి అల‌రించిన‌ట్లే, ఇప్పుడు ట్విట్ట‌ర్‌లో పోస్టులు చేస్తూ అల‌రిస్తున్నాడు.

ఆయ‌న త‌న పోస్టుల ద్వారా విసిరే చ‌లోక్తుల‌కి అభిమానుల నుంచి విప‌రీతంగా స్పంద‌న వస్తుంది. తాజాగా ఆయ‌న చేసిన పోస్టు కూడా అల‌రిస్తోంది. అప్ప‌ట్లో ఇంటి ముందు ఉండే సీసీ కెమెరాలు ఇవేనంటూ ఈ రోజు సెహ్వాగ్ ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. అందులో తాత‌య్య‌లు అరుగులపై కూర్చుని, వ‌చ్చిపోయేవారిని చూస్తూ గ‌మ‌నిస్తూ ఉన్నారు. సరదాగా ఉన్న ఈ ఫొటోని మీరూ చూడండి..  

  • Loading...

More Telugu News