మోదీ: మోహ‌న్‌ బాబు, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి లకు ప్రధాని మోదీ లేఖలు


మ‌హాత్మా గాంధీ జ‌యంతి రానున్న నేప‌థ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలు ‘స్వచ్ఛత హి సేవా’ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న వివిధ రంగాల్లోని ప్ర‌ముఖుల‌కు లేఖ‌లు రాస్తున్నారు. ఈ రోజు ఆయ‌న తెలుగు సినీ ప్ర‌ముఖుల‌కు లేఖ‌లు రాశారు. అందులో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, సినీ న‌టులు మోహ‌న్‌ బాబు, మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ ఉన్నారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం పట్ల స్ఫూర్తిని కొనసాగించాలని మోదీ కోరారు. మ‌న ప‌రిస‌రాలు ప‌రిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి సాధ్య‌ప‌డుతుంద‌ని చెప్పారు. అలాగే మోదీ యాప్‌లో అభిప్రాయాల‌ను పంచుకోవచ్చని మోదీ సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News